కర్నూలు జిల్లా కోసిగిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన జిల్లా పర్యటన అధికారికంగా ఖరారైంది. శనివారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 3న మంత్రాలయానికి చేరుకుని అక్కడే బస చేయనున్న ఆయన, జూన్ 4న కోసిగికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.