కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ముందస్తు అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్ ఎస్సై మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. శబ్ద కాలుష్యం వల్ల వృద్ధులు, రోగులు ఇబ్బంది పడుతున్నారని, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల తర్వాత డీజేలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ హెచ్చరిక డీజే నిర్వాహకులకు మాస్ వార్నింగ్ గా మారింది.