ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని బహుజన సేన సమితి నాయకులు సోమవారం ఎమ్మిగనూరు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తాగునీటి కొరతతో మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే శుద్ధమైన తాగునీరు అందించాలని వారు కోరారు. సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.