తుగ్గలి: ఎద్దు తొక్కడంతో ఒకరు మృతి

2500చూసినవారు
తుగ్గలి: ఎద్దు తొక్కడంతో ఒకరు మృతి
తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో శనివారం ఎద్దు తొక్కడంతో వృద్దుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నెల్లూరప్ప(77) పొలంలో కట్టేసి ఉన్న ఎడ్ల వద్దకు వెళ్లగా ఆ సమయంలో జారి కింద పడ్డాడు. ఎద్దు అదిరి ఆయన ఛాతి పై తొక్కింది. దీనికి తోడు వయో భారంతో పొలంలోనే అయన కొద్ది సేపటికి మరణించారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్