ఎమ్మిగనూరు జిల్లా కేంద్రం: ఏడో రోజుకు చేరిన నిరాహార దీక్షలు

11చూసినవారు
ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు ఏడవ రోజుకు చేరాయి. ఈరోజు ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారీగా సంఘీభావం తెలుపుతూ దీక్షలకు మద్దతు ప్రకటించారు. ఎమ్మిగనూరు ప్రధాన కూడలిలో టైర్లకు నిప్పు పెట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి, మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజాప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వమని కూడా జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు జిల్లా సాధన ఉద్యమానికి నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణ మద్దతు తెలపాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్