నకిలీ మద్యంపై ల్యాబ్ రిపోర్ట్.. నాణ్యత లేదని నిర్ధారణ

5895చూసినవారు
నకిలీ మద్యంపై ల్యాబ్ రిపోర్ట్.. నాణ్యత లేదని నిర్ధారణ
AP: ములకలచెరువులో జనార్దన్ తయారు చేసిన నకిలీ మద్యం నాణ్యత లేనిదని కాకినాడ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. 45 నమూనాల పరీక్షలో, ప్రమాణాలకు విరుద్ధంగా మద్యం తయారైనట్లు తేలింది. 25గా ఉండాల్సిన అండర్ ప్రూఫ్ (UP) 35గా, 75గా ఉండాల్సిన ఓవర్ ప్రూఫ్ (OP) 65గా ఉన్నట్లు రిపోర్టులో పేర్కొంది. మద్యం తయారీలో నాణ్యత, గాఢతలను UP, OP తెలియజేస్తాయి. కాగా, ఈ కేసులో జనార్దన్ రావు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.

సంబంధిత పోస్ట్