AP: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన SIT.. దీనిపై విచారణ చేపట్టిందని, ల్యాబొరేటరీ పరీక్షల నివేదికలు లడ్డూలో జంతువుల కొవ్వు లేదని స్పష్టంగా వెల్లడించాయని సజ్జల తెలిపారు. చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.