లడ్డూ వివాదం: అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో ఏపీ మండలిలో రచ్చ

49చూసినవారు
AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ శాసన మండలిలో తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, మండలి చైర్మన్ మోషేన్ రాజు క్రిస్టియన్లని వ్యాఖ్యానించారు. అయితే, తాను హిందువునని, తనను క్రిస్టియన్ గా మార్చాలని చూస్తున్నారని చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తప్పు ఒప్పుకున్నప్పటికీ, మండలిలో గందరగోళం తగ్గకపోవడంతో సభ వాయిదా పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్