తిరుమల లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యి వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన సిట్ ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని, అయితే జంతు కొవ్వు మాత్రం లేదని సిట్ స్పష్టంగా పేర్కొన్నట్లు టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. సిట్ నివేదిక ఆధారంగా మరోసారి కోర్టును ఆశ్రయిస్తానని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.