AP: సీఎం చంద్రబాబు ఇటీవల చేపట్టిన విదేశీ పర్యటన తీవ్ర గోప్యంగా సాగుతోందని YCP నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఎక్కడున్నారో, ఏ దేశంలో పర్యటిస్తున్నారో పారదర్శకంగా వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు టూర్‌పై ఆయన కుమారుడు, మంత్రి నారా
లోకేశ్ స్పందించి ప్రజల ముందు వివరాలు ఉంచాలని లక్ష్మీపార్వతి సూచించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు అనుసరించాల్సిన నిబంధనలను పాటించకుండా, సమాచారాన్ని దాచడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆమె ఆరోపించారు.