చెత్త వేశాడని పక్కింటి వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించారు

1045చూసినవారు
చెత్త వేశాడని పక్కింటి వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించారు
AP: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బేసిరామచంద్రపురంలో శనివారం ఉదయం భూమి వివాదం కారణంగా పక్కింటి వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం చోటుచేసుకుంది. పొందర మోహన్‌రావు, కీళ్ల సీతారాములు మధ్య భూమి విషయంలో గొడవలున్నాయి. సీతారాములు తన స్థలంలో వేసిన చెత్తను మోహన్‌రావు ఇంటిముందు వేయడంతో.. మోహన్‌రావు ఆగ్రహించి సీతారాములుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన సీతారాములును ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితుడు మోహన్‌రావును అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్