వైఎస్ జగన్ వల్లే భూసంస్కరణలు: మాజీ మంత్రి ధర్మాన (వీడియో)

15చూసినవారు
AP: 2019లో జగన్ అధికారంలోకి వచ్చే వరకూ ఎవరూ భూసంస్కరణలు తీసుకురాలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చామని, ఎన్నో ఏళ్లుగా చుక్కల భూములను సాగు చేసుకుంటున్న రైతులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చామన్నారు. దీనికోసం పలు రాష్ట్రాలలో విధానాలను పరిశీలించి చట్టం తీసుకొచ్చామన్నారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఒక్క భూసంస్కరణ అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్