AP: వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, "వైసీపీ హయాంలో భూములను అస్తవ్యస్తం చేశారు. ఎవరైనా నచ్చకపోతే వారి భూములను 22ఏ కింద పెట్టారు. నాకు వచ్చే ఫిర్యాదులన్నీ 22ఏ కింద పెట్టిన సొంత భూముల సమస్యలే. వైసీపీ నేతలు కబ్జా చేయాలనుకున్న భూమిని ప్రభుత్వ భూమిగా మార్చారు. భూ సమస్యలు పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది" అని అన్నారు.