పుణెలో ఇంటిపై విరిగిపడిన కొండ చరియలు.. ఒకరి మృతి

1899చూసినవారు
పుణెలో ఇంటిపై విరిగిపడిన కొండ చరియలు.. ఒకరి మృతి
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పుణె జిల్లా మావల్ తాలూకాలోని పటాన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక దళం సహాయక చర్యలు చేపట్టింది. కర్జత్-లోనావాలా ఘాట్ సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటంతో ముంబై-పూణే మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్