TG: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి లేజర్ లైట్లు కలకలం సృష్టించాయి. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా
విమానం హైదరాబాద్‌కు చేరుకుని ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో, లేజర్ లైట్లు
విమానం కాక్‌పిట్ వైపు ప్రసరించాయి. పైలట్ అప్రమత్తతతో
విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. పైలట్ల దృష్టిని తాత్కాలికంగా దెబ్బతీసే లేజర్ కాంతులు ల్యాండింగ్ సమయంలో అత్యంత ప్రమాదకరం. ఈ ఘటనపై భద్రతా విభాగాలు దర్యాప్తు ప్రారంభించాయి.