ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర.. షబ్బిర్ అరెస్ట్

9307చూసినవారు
ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర.. షబ్బిర్ అరెస్ట్
దేశంలో భారీ ఉగ్రకుట్రను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబాకు సహకరిస్తున్న షబ్బిర్ అహ్మద్ అనే ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఢిల్లీలోని వాణిజ్య ప్రాంతాలు, హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. షబ్బిర్ అహ్మద్ బంగ్లాదేశ్, పాక్ ఉగ్రవాద సంస్థలతో పాటు ఐఎస్‌ఐతో కూడా సంబంధాలు కలిగి ఉన్నాడు. భారత నిఘా సంస్థల నుంచి తప్పించుకోవడానికి టెలిగ్రాం వంటి యాప్స్ వాడినట్లు తెలిసింది. సరైన సమయంలో షబ్బిర్‌ను గుర్తించడంతో భారీ కుట్ర విఫలమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్