TG: మేడారం సమ్మక్క-సారలమ్మల మహాజాతరలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డీజీపీ బి.శివధర్ రెడ్డి శుక్రవారం మేడారంలో పర్యటించారు. జాతర చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘మేడారం 2.0’ పేరుతో అమలు చేస్తున్న ‘టీజీ-క్వెస్ట్’ కృత్రిమ మేధ ఆధారిత డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థ, క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్లు, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, ఏఐ అలర్ట్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భద్రతలో కీలక మార్పులు తీసుకొచ్చిందని డీజీపీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 13 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది, 450 సీసీటీవీల ద్వారా నిఘా, 37 పార్కింగ్ ప్రదేశాలు, 24 గంటల పోలీస్ హెల్ప్ డెస్కులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.