AP: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను నియంత్రించడానికి త్వరలో చట్టం తీసుకొస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఫేక్ ప్రచారాలను నియంత్రించాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనిపై నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కొందరు విదేశాల్లో దాక్కొని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతోందని చెప్పారు.