ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి టోల్‌ప్లాజా సమీపంలో ఎల్‌పీజీ ట్యాంకర్‌లో గ్యాస్ లీక్ కావడంతో క్షణాల్లోనే భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ ఒక్కసారిగా అగ్నిగోళంగా మారగా, దట్టమైన పొగతో పాటు ఎగిసిపడిన మంటలు పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మంటలను గమనించిన టోల్‌ప్లాజా సిబ్బంది, సమీపంలో ఉన్న వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.