AP: అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వైఎస్ షర్మిల స్వాగతించారు. అయితే కేవలం చట్టబద్ధత సరిపోదని, రాజధాని నిర్మాణానికి అవసరమైన సుమారు లక్ష కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం కొత్త రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేస్తూ, ఆ హక్కును రాష్ట్రం ఎందుకు వదులుకుంటోందని నిలదీశారు. కేంద్రం ఇస్తున్న అప్పులను ‘ముష్టి’గా వ్యాఖ్యానించిన ఆమె, హక్కుగా రావాల్సిన నిధుల కోసం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.