అమరావతికి చట్టబద్ధతపై పవన్ కల్యాణ్ హర్షం

1797చూసినవారు
అమరావతికి చట్టబద్ధతపై పవన్ కల్యాణ్ హర్షం
AP: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఏపీ చరిత్రలో కీలక ఘట్టమని, ఐదు కోట్ల మంది ప్రజలు సంతోషించే శుభ సందర్భమని తెలిపారు. అమరావతిని వ్యతిరేకించిన వారు ఇకనైనా స్వాగతించాలని, లేదంటే నష్టపోతారని వైసీపీ నాయకులకు సూచించారు. 33 వేల ఎకరాలు దానం చేసిన రైతులకు, సీఎం చంద్రబాబు నిబద్ధతకు, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్