ఏపీలో నిమ్మ ధరలు భారీగా పెరిగాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో 80 కేజీల నిమ్మ బస్తా ధర రూ.16 వేలకు చేరినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కేజీ ధర సుమారు రూ.200 పలుకుతోంది. దిగుబడి తగ్గడం, వాతావరణ పరిస్థితులు, ఇతర ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. గతంలో కిలో రూ.30-40 వరకు పడిపోయిన ధరలు ప్రస్తుతం గణనీయంగా పెరగడంతో నిమ్మ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.