‘లెనిన్’ అంటే కమ్యూనిజం కాదు: అఖిల్

2225చూసినవారు
‘లెనిన్’ అంటే కమ్యూనిజం కాదు: అఖిల్
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం జూలై 10న విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ రాజకీయ నేపథ్యంతో ముడిపడి ఉందని వచ్చిన ఊహాగానాలకు హీరో అఖిల్ తెరదించారు. ఈ టైటిల్‌కు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని, ఇది పూర్తిగా కల్పిత కథ అని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడి స్వగ్రామం రాయలసీమలో ‘లెనిన్ బాబు’ అనే వ్యక్తిని కలవడం, ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాల ప్రభావంతో పిల్లలకు లెనిన్, స్టాలిన్ వంటి పేర్లు పెట్టుకోవడం సాధారణమని అఖిల్ వివరించారు. కథానాయకుడి పవర్‌ఫుల్ పాత్రకు ఈ పేరు సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్