లెనోవో కొత్త ట్యాబ్‌ విడుదల

6548చూసినవారు
లెనోవో కొత్త ట్యాబ్‌ విడుదల
ప్రముఖ పీసీల తయారీ సంస్థ లెనోవో, దేశీయ మార్కెట్లోకి 'లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2' పేరుతో కొత్త ట్యాబ్‌ను విడుదల చేసింది. ఈ ట్యాబ్ 12.1 అంగుళాల 2.5K IGZO LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, 10,200mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 15 గంటల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. 8GB+128GB వేరియంట్ ధర రూ.35,999, 8GB+256GB వేరియంట్ ధర రూ.38,999గా నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్