AP: అమరావతి కేంద్రంగా పనిచేస్తున్న లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. లేపాక్షి షోరూమ్‌లలో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో, ఉద్యోగుల మూల వేతనంపై 10 శాతం కంటే ఎక్కువ పెంపును మంత్రి సవిత ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.60.75 కోట్లకు అమ్మకాలు పెరగడం ఈ నిర్ణయానికి కారణమని ప్రభుత్వం తెలిపింది. అమ్మకాలు పెంచడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను మంత్రి అభినందించారు.