
శంషాబాద్లో ప్రతికూల వాతావరణం.. 10 విమాన సర్వీసులు రద్దు
తెలంగాణలో శుక్రవారం దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 10 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ముంబయి, బెంగళూరు, విశాఖ, కోయంబత్తూర్, కోల్కతా, కోచి, వారణాసి, ఇందౌర్, పట్నా, గువాహటికి వెళ్లే విమానాలను డీజీసీఏ రద్దు చేసింది. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు హైవేలపై పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్-బెంగళూరు హైవేపై నాలుగు లారీలు ఢీకొనడంతో ట్రాఫిక్ జామ్ అయింది.




