AP: స్థానిక ఎన్నికల్లో సత్తా చూపుదామని వైసీపీ శ్రేణులకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ అధినేత జగన్ మంజూరు చేసిన పింఛన్లనే టీడీపీ నేతలు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందే మళ్లీ కొత్త పింఛన్ల నాటకం మొదలు పెట్టారన్నారు. చంద్రబాబుకు అబద్ధపు హామీలు, ప్రజలను మోసం చేయడం అలవాటేనని పేర్కొన్నారు.