ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విధంగా స్వదేశీ తయారీ నినాదాన్ని అందరం స్వీకరిద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మహిళలు, వినియోగదారులు, వ్యాపారులకు సమానంగా శక్తినిచ్చే పన్ను విధానం ఇప్పుడు వాస్తవం అయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనం అవుతాయని, పెట్టుబడులకు ఊతం ఇస్తాయని మంత్రి తెలిపారు.