2030 నాటికి ఆదాయం రెట్టింపు లక్ష్యంతో భారత్‌పై ఎల్‌జీ ఫోకస్

5234చూసినవారు
2030 నాటికి ఆదాయం రెట్టింపు లక్ష్యంతో భారత్‌పై ఎల్‌జీ ఫోకస్
దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, తన భవిష్యత్ వ్యాపార వృద్ధికి భారత్‌ను కీలక కేంద్రంగా పరిగణిస్తోంది. 2030 నాటికి భారత్, సౌదీ అరేబియా, బ్రెజిల్ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడం, అతిపెద్ద వినియోగ మార్కెట్ కావడంతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత గృహోపకరణాల విస్తరణపై దృష్టి సారించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో మూడో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులను పెంచుకోవాలని చూస్తోంది.

సంబంధిత పోస్ట్