LIC వినియోగదారుల కోసం 'బీమా కవచ్ ప్లాన్-887' పేరుతో స్వచ్ఛమైన రిస్క్ ప్రొటెక్షన్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పథకం పాలసీదారుడి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని అందించే ఈ నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పాలసీలో కనీస బీమా మొత్తం రూ.2 కోట్లు. 18 నుంచి 65 ఏళ్ల వయసు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపుల్లో సింగిల్, పరిమిత కాలం (5, 10, 15 ఏళ్లు), లేదా రెగ్యులర్ వంటి మూడు విభిన్న పద్ధతులను ఎంచుకోవచ్చు. 30 ఏళ్ల వ్యక్తి రూ.2 కోట్ల బీమాతో 20 ఏళ్ల కాలానికి తీసుకుంటే, రెగ్యులర్ విధానంలో ఏడాదికి రూ.19,000 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ ద్వారా పాలసీదారులకు, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘకాలిక భరోసా లభిస్తుంది.