చికెన్ షాపులకు లైసెన్సులు.. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు

2588చూసినవారు
చికెన్ షాపులకు లైసెన్సులు.. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు
AP: రాష్ట్రంలో చికెన్ విక్రయ దుకాణాలకు లైసెన్సులు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన చికెన్ అందించడమే లక్ష్యమని, అక్రమ వ్యాపారాలను అరికట్టాలని భావిస్తోంది. కోళ్ల సరఫరా వ్యవస్థను ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. అయితే, చిన్న వ్యాపారులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లైసెన్సుల పేరుతో తమ వ్యాపారాలపై నియంత్రణ పెరుగుతుందని, ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తామని, ఇది ధరలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్