భారత ఆర్మీ నూతన అధిపతిగా ధీరజ్ సేథ్ నియామకం

3798చూసినవారు
భారత ఆర్మీ నూతన అధిపతిగా ధీరజ్ సేథ్ నియామకం
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను నియమించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ కాలం జూన్ 30 నుంచి ముగుస్తుంది. ఆరోజే ఆర్మీ చీఫ్‌గా ధీరజ్‌ సేథ్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్‌గా సేవలందిస్తున్నారు. ఆయన ఖడక్ వాస్లాలోని ప్రతిష్టాత్మక 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ' (NDA) పూర్వ విద్యార్థి. ఆయన డిసెంబర్ 1986లో భారత సైన్యంలో చేరారు.

సంబంధిత పోస్ట్