కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదీ మృతి

6చూసినవారు
కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదీ మృతి
AP: అన్నమయ్య జిల్లా తంతివారిపల్లికి చెందిన రఘుపతి, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రఘుపతి మృతి చెందాడు. ఖైదీ మృతిని పోలీసులు ధృవీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :