నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ

22చూసినవారు
AP: భార్య హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్న షేక్ చిన సైదులు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. 2022లో శిక్ష పడిన సైదులు, 2024లో రాజమండ్రి నుంచి నెల్లూరు జైలుకు బదిలీ అయ్యాడు. జైల్లో సత్ప్రవర్తన కారణంగా ఓపెన్ జైల్లో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో అతను తప్పించుకున్నాడు. ఈ ఘటనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో జైలు అధికారులు ఫిర్యాదు చేయగా, పోలీసులు పరారైన ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్