ఈఫిల్ టవర్‌పై పడిన పిడుగు.. వీడియో

8597చూసినవారు
పారిస్‌లో పర్యాటక కేంద్రంగా కొనసాగుతున్న ఈఫిల్ టవర్ తాజాగా ఓ అద్బుత ఘటనకు వేదికైంది. రాత్రిపూట ఈఫిల్ టవర్‌పై ఓ శక్తివంతమైన పిడుగు పడింది. దాని కాంతితో పారిస్ నగరం అద్భుతంగా వెలిగిపోతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 330 మెట్రిక్ టన్నుల ఇనుముతో నిర్మించిన ఈ టవర్, ఇలాంటి మెరుపులను తట్టుకోగలదని నిపుణులు తెలిపారు. మరోవైపు, తీవ్రమైన వేడితో అల్లాడుతున్న అక్కడి ప్రజలు వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ పలువురు మరణించారు.

సంబంధిత పోస్ట్