AP: లిక్కర్ కేసులో ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి రిమాండ్ మంగళవారం ముగిసింది. గుంటూరు జైలులో ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. జైలు నుంచి వర్చువల్‌గా ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. ఈశ్వర్ రిమాండ్‌ను వచ్చే నెల 11కు ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. అప్రూవర్‌గా మారేందుకు వేసిన సత్యప్రసాద్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.