AP: లిక్కర్ స్కామ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం CBIకి అప్పగించనుందనే ప్రచారం జరుగుతోంది. 'సిట్' అరెస్ట్ చేస్తే జగన్‌కు ప్రజల్లో సానుభూతి పెరిగే అవకాశం ఉందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాళేశ్వరం కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో లిక్కర్ స్కామ్ కేసును CBIకి అప్పగిస్తే జగన్ అరెస్ట్ అయినా ప్రజల్లో సానుభూతి రాదని చంద్రబాబు సర్కార్ ఆలోచిస్తున్నట్లు చర్చ సాగుతోంది.