పంజాబ్‌లో భారీగా తగ్గిన మద్యం ధరలు

22878చూసినవారు
పంజాబ్‌లో భారీగా తగ్గిన మద్యం ధరలు
పంజాబ్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి మద్యం దుకాణాల లైసెన్సుల గడువు మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, పాత నిల్వలను క్లియర్ చేయడానికి దుకాణాలు మద్యం ధరలను 30-50% వరకు తగ్గించాయి. జలంధర్, లుధియానా, అమృత్‌సర్ వంటి నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తున్నారు. చండీగఢ్‌లో కూడా ధరలు తగ్గినా, పోలీసుల ఆంక్షల కారణంగా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఏప్రిల్ 1 నుండి కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తే ధరలు పెరగొచ్చనే భయంతో ప్రజలు ప్రస్తుతం మద్యం నిల్వ చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్