త్వరలో మద్యం ధరలు పెంపు!

16చూసినవారు
త్వరలో మద్యం ధరలు పెంపు!
AP: మద్యం ధరలు పెంపు దిశగా చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానంపై మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. విమానాశ్రయాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజుల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన దిశగా ఉపసంఘం చర్చించింది. అధిక శుద్ధి ఆల్కహాల్ తయారీకి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. మద్యం ధరలు పెంచితే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎలా ఉంటాయనే విషయంపై కూడా చర్చించింది.

సంబంధిత పోస్ట్