AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను నవంబర్ 7 వరకు పొడిగించింది. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టు కాగా, అందులో ఐదుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి సహా ఏడుగురు నిందితులు విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.