ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ముమ్మరం చేసింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారుడు విచారణాధికారుల ముందు హాజరయ్యారు. చెవిరెడ్డి భార్య పేరు మీద పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.