వైసీపీ హయాంలో జరిగిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ కొనసాగుతోంది. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఐదు గంటలుగా అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. కుంభకోణానికి సంబంధించి జరిగిన విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలు, విజయసాయి అందించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.