AP: జులై నెలలో తల్లికి వందనం డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే తల్లికి వందనం అర్హుల జాబితాను గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది దాదాపు 68 లక్షల విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాగా, ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రభుత్వం రూ.13 వేలు జమ చేయనుంది.