సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఒక పాము ప్లాస్టిక్ చెప్పును నోటితో గట్టిగా పట్టుకుని దానిపై ఆకుపచ్చ రంగులో చిక్కటి విషాన్ని ఏకధాటిగా విడుదల చేయడం కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు. పాము విషం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో స్పష్టంగా చూపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. వీడియోలో పాము చూపిన ఆగ్రహం, విషం విడుదల తీరు చూస్తుంటే అది అత్యంత విషపూరిత జాతికి చెందినదై ఉండొచ్చని అంటున్నారు. అయితే వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదకర జీవుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.