కాలేయం శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో, జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. మారిన జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోంది. గుమ్మడి గింజలు, అవకాడో, పాలకూర, ఆలివ్ ఆయిల్, డార్క్ చాక్లెట్, సోయాబీన్స్, బాదం, జీడిపప్పు వంటి మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ఇవి ఫ్యాటీ లివర్, ఆక్సీకరణ ఒత్తిడి, కాలేయ వాపును తగ్గించి, మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.