AP: డ్వాక్రా మహిళలకు శుభవార్త. ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, డ్వాక్రా మహిళలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రుణాన్ని మహిళలు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ లోన్ మొత్తాన్ని దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం ద్వారా మంజూరు చేయనున్నారు. అర్హులైన మహిళలందరూ ఈ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.