విద్యార్థులకు విద్యాలక్ష్మి పథకంతో రూ.16 లక్షల వరకు రుణం

5111చూసినవారు
విద్యార్థులకు విద్యాలక్ష్మి పథకంతో రూ.16 లక్షల వరకు రుణం
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులు చదవలేని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 'విద్యాలక్ష్మి' పథకం ద్వారా చేయూత అందిస్తోంది. 2024లో ప్రారంభమైన ఈ పథకం కింద, విద్యార్థులు రూ.16 లక్షల వరకు విద్యా రుణం పొందవచ్చు. రూ.10 లక్షల రుణానికి 3% వడ్డీ మాత్రమే ఉంటుంది, దీనిని 15 ఏళ్లలో తిరిగి చెల్లించవచ్చు. కేంద్రం వడ్డీపై సబ్సిడీ కూడా ఇస్తుంది.  కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల వరకు ఉన్నవారు, టాప్ 860 విద్యాసంస్థల్లో సీటు పొందినవారు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి https://pmvidyalaxmi.co.in/Index.aspx వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

సంబంధిత పోస్ట్