AP: డ్వాక్రా మహిళల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆడపిల్లల వివాహాలకు భరోసాగా 'కల్యాణ లక్ష్మి' పథకాన్ని స్వల్ప వడ్డీతో అమలు చేయనుంది. ఈ పథకం కింద కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.లక్ష వరకు రుణం మంజూరు కానుంది. తీసుకున్న మొత్తాన్ని 4 శాతం వడ్డీతో వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలి. వివాహం చేసుకునే అమ్మాయి వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. అర్హులు గ్రామ, వార్డు సమాఖ్యల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.