AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాలకు పోలింగ్ స్టేషన్ల ఖరారుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 14 నాటికి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయనున్నారు. 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు అదే రోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు.