AP: మంత్రి నారా లోకేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులను సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వచ్చే నేతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కేవలం అవకాశవాదం కోసం పార్టీ మారేవారు ఎల్లప్పుడూ టీడీపీలో కొనసాగుతారనే గ్యారెంటీ లేదని లోకేశ్ తెలిపారు.